• Language icon
  • ONDC Logo

    Do you want to change your default language?

    Continue Cancel
    ONDC Buddy

    Your guide and personal companion for ONDC Network Click Here

    ప్రస్తుత షాపింగ్ ల్యాండ్‌స్కేప్‌లో, మీకు అందుబాటులో ఉన్న యాప్ లేదా వెబ్‌సైట్‌ కే మాత్రమే మీరు పరిమితం అయ్యేవారు. ఇతర ఎంపికలను యాక్సెస్ చేయడానికి, మీరు అదనపు యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లను వెతకాలి. ONDC నెట్‌వర్క్, మీరు ఊహించని మార్పును మీకు అందిస్తుంది. దీనినే మేము ఫ్యుచర్ షాపింగ్ అంటాము!

    అన్ బన్డిల్డ్. ట్రాన్స్పరెంట్. ఓపెన్.

    ఓపెన్ నెట్‌వర్క్, టెక్నాలజీని ఉపయోగించి అన్ని ప్లాట్‌ఫారమ్‌లను అనుసంధానం చేయడం ద్వారా కొనుగోలుదారులు, విక్రేతలందరూ ఏ యాప్‌లో ఉన్నా ఒకరితో ఒకరు పరస్పరం లావాదేవీలు జరుపుకునేలా చేస్తుంది. ఇప్పుడు, మీరు నెట్‌వర్క్‌లోని ఏదైనా ఒక, సంఘటిత యాప్ లేదా వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులో ఉన్న విక్రేతలు, ఉత్పత్తుల మొత్తం సెలక్షన్ నుండి కూడా ఎంపిక చేసుకోవచ్చు.

    More

    ONDC నెట్‌వర్క్ ద్వారా చేసే షాపింగ్ గురించి మీరు తప్పక తెలుసుకోవలసినది

    • బయ్యర్ యాప్స్ అని పిలువబడే వివిధ షాపింగ్ అప్లికేషన్స్ లో దేనినైనా ఎంచుకోవడానికి మీకు స్వేచ్ఛ ఉంది. ఈ యాప్‌లలో ఏదైనా ఒకదాని ద్వారా, మీరు నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులు మరియు సేవల మొత్తం సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. ఇవి ఇచ్చే అనుభూతి విభిన్నంగా ఉంటుంది. కాబట్టి, మీరు కొనుకునేవాటిలో ఏది మీకు సరిగ్గా సరిపోతుందో దానిని మీరు ఎంచుకోవచ్చు.
    • ఈ నెట్‌వర్క్‌లో, 12 కేటగిరీల ఉత్పతులను, 7.64+ Lakh మంది విక్రేతలు/సర్వీస్ ప్రొవైడర్‌లు కలిగి ఉన్నారు. ప్రతి వారం వీరి సంఖ్య వేలల్లో పెరుగుతూ ఉంది. అయితే, నెట్‌వర్క్ యొక్క ఈ ప్రారంభ దశలో, అన్ని యాప్‌లు ప్రతి ఉత్పత్తి మరియు అది లభించే ప్రదేశానికి అనుగుణంగా ఉండవని గమనించడం ముఖ్యం. నెట్‌వర్క్ విస్తరణ కొనసాగేకొద్దీ, ఈ పరిమితి త్వరగా పాతబడిపోతుంది. అప్పుడు మీరు ఏదైనా కేటగిరికి చెందిన ఉత్పత్తి లేదా సేవను కనుగొనడానికి, కొనుగోలు చేయడానికి మీకు నచ్చిన యాప్‌లలో దేనినైనా ఉపయోగించగలరు.

    దీనిని ప్రారంభించడానికి, మీకు ఆసక్తి ఉన్న కేటగిరిని ఎంపిక చేసుకోండి. ONDC నెట్‌వర్క్‌లో నిర్దిష్ట కేటగిరి విక్రేతల నుండి షాపింగ్ చేయడంలో మీకు ఏ బయ్యర్ యాప్ లు సహాయపడతాయో మేము మీకు చూపుతాము.

    మీరు ఎలా షాపింగ్ చేస్తారో పునరాలోచించండి

     category icon
    1. మీరు షాపింగ్ చేయాలనుకుంటున్న కేటగిరిని ఎంపిక చేసుకోండి
    1. మీరు షాపింగ్ చేయాలనుకుంటున్న కేటగిరిని ఎంపిక చేసుకోండి
    buyer app icon
    2. అందుబాటులో ఉన్న జాబితా నుండి బయ్యర్ యాప్‌ను ఎంపిక చేసుకోండి
    2. అందుబాటులో ఉన్న జాబితా నుండి బయ్యర్ యాప్‌ను ఎంపిక చేసుకోండి
    search order
    3. బ్రౌజ్ చేసి మీ ఆర్డర్‌ ను ఇవ్వండి
    3. బ్రౌజ్ చేసి మీ ఆర్డర్‌ ను ఇవ్వండి
    confirmation icon
    4. ఆర్డర్ కన్ఫర్మేషన్ పొందండి
    4. ఆర్డర్ కన్ఫర్మేషన్ పొందండి

    నెట్‌వర్క్‌లో విజయవంతంగా ఆర్డర్ చేసిన తర్వాత, మీరు ఆర్డర్ అప్‌డేట్‌లను పొందడం ప్రారంభిస్తారు. ఈ డిజిటల్ విప్లవంలో, 'ఓపెన్ నెట్‌వర్క్' అని మేము పిలిచే వ్యవస్థ ద్వారా అనేక భాగస్వామ్య కంపెనీలు మీ ఆర్డర్ విషయంలో కలసికట్టుగా పనిచేస్తూ మీకు తగిన నోటిఫికేషన్లను అందిస్తుంది.

    ఉత్పత్తులు మరియు సేవల పూర్తి వివరాలను తెలుసుకోండి

    Sort By:

    Choose a Buyer Application

    నోట్:

    నెట్ వర్క్ మరింత పెరిగిన తర్వాత, నెట్ వర్క్ ద్వారా ఇంకా అనేక కేటగిరీలు, డొమైనలు కూడా జతచేయబడుతాయి. ఇవి ONDC ప్రోటోకాల్ కంప్లైంట్ బయ్యర్ అప్లికేషన్ల ద్వారా ఎనేబుల్ చేయబడుతాయి

    గమనిక: ONDC బయ్యర్ అప్లికేషన్ లో దేనినీ ఆమోదించదు. బ్రాండ్‌లు/బయ్యర్ అప్లికేషన్ క్రమం కూడా యాదృచ్ఛికంగా, అంటే, ఒక నిర్దిష్ట క్రమంలో ఉండదు. బ్రాండింగ్, లోగోలు సంబంధిత నెట్‌వర్క్ పార్టిసిపెంట్‌ల అజమాయిషీలో ఉంటాయి మరియు పరిమిత, బదిలీ చేయలేని లైసెన్స్ కింద ONDC ద్వారా ఉపయోగించబడతాయి. ఈ బయ్యర్ అప్లికేషన్‌ల ద్వారా నెరిపిన ఏ లావాదేవీకి ONDC బాధ్యత వహించదు. అంతేకాక, అలా జరిపిన ఏ లావాదేవీకి ఎలాంటి నిబంధనలను లేదా బాధ్యత లేదా వ్యారంటీ కూడా ఇవ్వదు.

    திசைதிருப்புகிறது paytm.com

    దీనికి 10 సెకన్ల వరకు సమయం పట్టవచ్చు