ప్రస్తుత షాపింగ్ ల్యాండ్‌స్కేప్‌లో, మీకు అందుబాటులో ఉన్న యాప్ లేదా వెబ్‌సైట్ కే మాత్రమే మీరు పరిమితం అయ్యేవారు. ఇతర ఎంపికలను యాక్సెస్ చేయడానికి, మీరు అదనపు యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లను వెతకాలి. ONDC నెట్‌వర్క్, మీరు ఊహించని మార్పును మీకు అందిస్తుంది. దీనినే మేము ఫ్యుచర్ షాపింగ్ అంటాము!
అన్ బన్డిల్డ్. ట్రాన్స్పరెంట్. ఓపెన్.
ఓపెన్ నెట్‌వర్క్, టెక్నాలజీని ఉపయోగించి అన్ని ప్లాట్‌ఫారమ్‌లను అనుసంధానం చేయడం ద్వారా కొనుగోలుదారులు, విక్రేతలందరూ ఏ యాప్‌లో ఉన్నా ఒకరితో ఒకరు పరస్పరం లావాదేవీలు జరుపుకునేలా చేస్తుంది. ఇప్పుడు, మీరు నెట్‌వర్క్‌లోని ఏదైనా ఒక, సంఘటిత యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉన్న విక్రేతలు, ఉత్పత్తుల మొత్తం సెలక్షన్ నుండి కూడా ఎంపిక చేసుకోవచ్చు.
More
ONDC నెట్‌వర్క్ ద్వారా చేసే షాపింగ్ గురించి మీరు తప్పక తెలుసుకోవలసినది
- బయ్యర్ యాప్స్ అని పిలువబడే వివిధ షాపింగ్ అప్లికేషన్స్ లో దేనినైనా ఎంచుకోవడానికి మీకు స్వేచ్ఛ ఉంది. ఈ యాప్‌లలో ఏదైనా ఒకదాని ద్వారా, మీరు నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులు మరియు సేవల మొత్తం సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. ఇవి ఇచ్చే అనుభూతి విభిన్నంగా ఉంటుంది. కాబట్టి, మీరు కొనుకునేవాటిలో ఏది మీకు సరిగ్గా సరిపోతుందో దానిని మీరు ఎంచుకోవచ్చు.
- ఈ నెట్‌వర్క్‌లో, 12 కేటగిరీల ఉత్పతులను, 7.32+ Lakh మంది విక్రేతలు/సర్వీస్ ప్రొవైడర్‌లు కలిగి ఉన్నారు. ప్రతి వారం వీరి సంఖ్య వేలల్లో పెరుగుతూ ఉంది. అయితే, నెట్‌వర్క్ యొక్క ఈ ప్రారంభ దశలో, అన్ని యాప్‌లు ప్రతి ఉత్పత్తి మరియు అది లభించే ప్రదేశానికి అనుగుణంగా ఉండవని గమనించడం ముఖ్యం. నెట్‌వర్క్ విస్తరణ కొనసాగేకొద్దీ, ఈ పరిమితి త్వరగా పాతబడిపోతుంది. అప్పుడు మీరు ఏదైనా కేటగిరికి చెందిన ఉత్పత్తి లేదా సేవను కనుగొనడానికి, కొనుగోలు చేయడానికి మీకు నచ్చిన యాప్‌లలో దేనినైనా ఉపయోగించగలరు.
దీనిని ప్రారంభించడానికి, మీకు ఆసక్తి ఉన్న కేటగిరిని ఎంపిక చేసుకోండి. ONDC నెట్‌వర్క్‌లో నిర్దిష్ట కేటగిరి విక్రేతల నుండి షాపింగ్ చేయడంలో మీకు ఏ బయ్యర్ యాప్ లు సహాయపడతాయో మేము మీకు చూపుతాము.
మీరు ఎలా షాపింగ్ చేస్తారో పునరాలోచించండి
నెట్ వర్క్ మరింత పెరిగిన తర్వాత, నెట్ వర్క్ ద్వారా ఇంకా అనేక కేటగిరీలు, డొమైనలు కూడా జతచేయబడుతాయి. ఇవి ONDC ప్రోటోకాల్ కంప్లైంట్ బయ్యర్ అప్లికేషన్ల ద్వారా ఎనేబుల్ చేయబడుతాయి